పనికిరాని కీబోర్డులు, మౌస్‌లతో ఎత్తైన భవనాలు.. ఫిదా అయిన ఐక్యరాజ్యసమితి

-

ఎటూ చూసినా ఎత్తైనా భవనాలు.. ఆకాశం కూడా ఒక్కోసారి కనిపించడం కష్టమైపోతుందన్నట్లు ఉంటాయి. వీటి నిర్మాణం అభివృద్ధికి సంకేతం కావొచ్చు కానీ.. పర్యావరణానికి కాదు అనేది జగమెరిగిన సత్యం. తృప్తి దోషి కూడా ఇదే అంటున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని తాను నిర్మించే భవనాలు ఈ తరం వారికి స్పూర్తిగా నిలుస్తున్నాయి.‘వెర్నాక్యులర్‌ ఆర్కిటెక్చర్‌’… ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు దీని గురించి బాగా తెలుసు.. కానీ భవిష్యత్తులో పెద్దగా ఆదాయాన్ని ఇవ్వదని చాలామంది దీనిపై అసలు దృష్టిపెట్టరు.

కానీ ఇదే అధ్యాయం ముంబయిలో ఆర్కిటెక్చర్‌ చదువుతున్న తృప్తి దోషిని పూర్తిగా మార్చేసింది. ‘మనం పోటీలు పడి కట్టే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వాడే పదార్థాలు పర్యావరణానికి ఎంత హానిచేస్తున్నాయో తెలుసుకున్న తృప్తి..సారవంతమైన, పంటలు పండించే మట్టిని కాల్చి నిర్వీర్యం చేసి ఇటుకలు చేస్తున్నాం. కానీ ఆ మట్టిని తయారు చేసుకోవడానికి భూమికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. రెండో కాలుష్య కారకం… రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌. దేశంలో నిర్మాణాలన్నీ దీంతోనే జరుగుతున్నాయి.

మన దేశ కర్బన ఉద్గారాల్లో ఈ నిర్మాణాల వాటా 22 శాతం ఉంటుంది.. ఇంత విధ్వంసం జరుగుతుందని కూడా చాలామందికి తెలియదు. వీటి ప్రభావం మన తర్వాత వచ్చే జనరేషన్ పై ఘోరంగా పడుతుంది. అందుకే వెర్నాక్యులర్‌ ఆర్కిటెక్చర్‌పై దృష్టి పెట్టాను అంటోంది తృప్తి.. కాంక్రీట్‌, సిమెంట్‌ లేనప్పుడు మన పూర్వీకులు సున్నం, మట్టి, కలప, బండలు, రాళ్లు వంటి వాటితో నిర్మించే వారు.ఇప్పుడు ఆధునిక అవసరాలకు తగినట్టు మార్పులు చేస్తామని తృప్తి చెప్తోంది.

ఈ నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి తను దేశమంతా తిరిగారట. ‘తమిళనాడులో 82 ఏళ్ల ఒక పెద్దాయనకి చెట్టినాడు నిర్మాణశైలి గురించి తెలుసని విని వెళ్లి, ఆ కిటుకులు తెలుసుకుంది.. ధర్మశాలలో ఉంటున్న దీదీ కాంట్రాక్టర్‌ గురించీ తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ స్థిరపడ్డ దీదీ విదేశాల్లో ఆర్కిటెక్చర్‌ చదువుకున్నారు. కానీ హిమాలయాలకు ఏమాత్రం హాని జరగకుండా మన పూర్వీకులు అనుసరించిన నిర్మాణశైలి ఆమెని ఇక్కడే ఉండేలా చేసింది. ప్రస్తుతం ఆ తరహా ఇళ్లను నిర్మించేది ఆమె ఒక్కరే. కేరళలోని బైజూ, మార్క్‌మురేలాంటి వాళ్లని చూసి ఇంకా నేర్చుకున్నారట.. స్థానిక నిర్మాణశైలికి ఆధునిక హంగులు అద్దడం ఎలానో ఇక్కడే తెలిసిందని తృష్తి పేర్కొంది. .

కనుచూపుమేరంతా బీడువారిన నేలలే. భయంకరమైన వేడి, ఉక్క. అలాంటి ప్రాంతంలోనే తమిళనాడులోని ఆరోవిల్లే స్వచ్ఛంద సంస్థకి శరణం రూరల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని నిర్మించాల్సి వచ్చింది. స్టీల్‌, సిమెంట్‌, ఇటుకల వాడకాన్ని బాగా తగ్గించి… మట్టితో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసిందట తృష్తి.. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి తమ దగ్గర ఈ నిర్మాణ నైపుణ్యాలు తెలిసిన వారు చాలా తక్కువ. అది పూర్తయ్యే సమయానికి 300 మంది స్థానికులకు శిక్షణ ఇచ్చారట…

వాననీటిని ఒడిసిపట్టి ఆ నీటినే దాని కోసం వాడి… 4,500 చదరపు అడుగుల స్లాబ్‌ వేయడానికి కేవలం 33 సిమెంట్‌ బస్తాలని మాత్రమే వాడారట. వావ్.. అంత స్లాబ్ కు కేవలం అంత తక్కువ సిమెంట్ హా.. చాలా గొప్ప విషయం కదా. ఈరోజుల్లో చిన్న చిన్న పనులకే సిమెంట్ విపరీతంగా వాడేస్తున్నారు.

యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాల్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ సంస్థ ఈ నిర్మాణాన్ని గుర్తించి భావితర నిర్మాణాలకు స్ఫూర్తిగా చూపించింది. ఈ ఆత్మవిశ్వాసంతో అరోమా గ్రూప్‌ని ప్రారంభించారు తృప్తి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ హిత నిర్మాణాలు చేపడుతున్నారు. ఫ్రెంచ్‌ నిర్మాణశైలిలో… అరోవిల్లేలో నిర్మించిన అరోమా ఫ్రెంచ్‌ విలామెంట్స్‌ ప్రాజెక్ట్‌ ఆమె సృష్టించిన మరో అద్భుతంగా చెప్పుకోవచ్చు.

స్లాబ్‌లు, గోడల నిర్మాణం కోసం తృప్తి వ్యర్థాలని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ- వేస్ట్‌ అంటే పనికిరాని కీబోర్డులు, మౌస్‌లతో పాటు కొబ్బరిచిప్పలు, పాత సీడీలు, గాజు సీసాలు, ఖాళీ టెట్రాప్యాక్‌లు, చాక్లెట్‌ రేపర్లని ఉపయోగిస్తారట.. అలాగే… పరిశ్రమల నుంచి వెలువడే బూడిదతో ఇటుకలు చేసి, నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు.

ఇలానే అందరూ నిర్మిస్తే.. పర్యావరణానికి కాలుష్యమే ఉండదు కదా.. ఇంకా నిర్మాణాల ఖర్చు కూడా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version