మునగాకు వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలో తెలుసా…!

-

చాలా మందికి మునగాకును ఆహారంగా తీసుకోవచ్చనే సంగతి తెలియదు. కొంతమంది కి మునగాకు తింటే వేడి చేస్తుందనే అపోహ కూడా ఉంది. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్థాలలో మునగాకును కూడా చేర్చవచ్చు. మునగాకులో ఉన్న విటమిన్స్, ఖనిజ లవణాలు మన శరీరానికి యెన లేని మేలుని కలగ చేస్తాయి. అంతేకాక మునగాకు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. మునగాకులో ఉన్న పోషకాల గురించి మరియు మునగాకు తో వైద్య విధానాల గురించి తెలుసుకుందాం.

ఒక కప్పుడు మునగాకు రసంలో 8 యాపిల్స్, 6 కమలాలు, 6 నిమ్మకాయలు లో ఉన్న విటమిన్ సి ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసములో ఉన్నది. రెండున్నర కిలోల మాంసంలో ఎంత కాల్షియం ఉంటుందో గుప్పెడు మునగాకు లోను అంత కాల్షియం ఉంటుంది. ఇంకా దీనిలో ఉన్న మాంస కృత్తులు కూడా మాంసం, చేపలు, గుడ్లు, పాలు మొదలగు వాటిలో ఉన్న వాటి కంటే అధికంగా ఉన్నాయి.

మునగాకులతో వైద్య విధానాలు: మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి, గట్టిగా మూతపెట్టి, 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి, పాత్రలోని మునగాకును తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం వేసి ప్రతి రోజు ఉదయము సేవిస్తే అజీర్తి, రక్త హీనత, సాధారణ జలుబు, దగ్గు, నీరసం లాంటివి దరిచేరవు. ఒక స్పూన్ మునగాకు రసములో 3 మిరియాలను పొడి చేసి కలిపి కణతలపై రాసుకుంటే తల నొప్పి అంతరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version