పాకిస్థాన్‌తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన చర్యలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కుళాయి దాడులను ఇండియన్ ఆర్మీ ధైర్యంగా తిప్పికొట్టిందని ప్రశంసించారు. అవసరం పడితే తాను స్వయంగా బార్డర్ వద్ద యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయంలో ఉందని, మన సైన్యం చూపిన సాహసాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉత్తమ్ మాట్లాడుతూ, “పహల్గాం ప్రాంతంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై జరిపిన దాడి అమానవీయమైన చర్య. ఇది మత ఘర్షణలకు దారితీయాలనే కుట్ర. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ప్రతీకార దాడులు ప్రాంశస్‌గా జరిగాయి. స్వయంగా మిలిటరీలో పనిచేసిన అనుభవంతో చెప్పగలను – ఇప్పుడు సైన్యం టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తోందన్నారు.