ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచితనాన్ని ప్రదర్శించారు. కాకినాడ జిల్లా కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల జనసేన వీరాభిమానిని అయిన పోతుల పేరంటాలను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమె కోరిక మేరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి భోజనానికి ఆహ్వానించిన పవన్, ఆమెకు చీరతో పాటు లక్ష రూపాయల నగదు సహాయం అందించారు. పేరంటాలు ఎంతో కాలంగా పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉండి, ఆయన రాజకీయ విజయాన్ని వేగులమ్మ తల్లికి మొక్కుకున్నారు.
పిఠాపురం నుంచి గెలిస్తే అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్న ఆమె, తన పింఛన్ సొమ్ము నుండి నెలకు ₹2,500 చొప్పున పొదుపు చేసి మొత్తం ₹27,000 గరగ కోసం వినియోగించి అమ్మవారికి సమర్పించారు. ఈ వేళ పవన్‌తో భోజనం చేయాలన్న కోరికను ఆమె వ్యక్తపరచగా, అది తెలుసుకున్న పవన్ స్వయంగా ఆమెను ఆహ్వానించి కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల మధ్య పవన్ సహృదయతపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.