దుబ్బాక ఉప ఎన్నిక.. ఆయన గెలిచిన మళ్లీ టీఆర్ఎస్ లోకే..!

-

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి . ఈ క్రమంలోనే ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో తమదే విజయమని అంటూ అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రఘునందన్ రావు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకవేళ దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలిస్తే మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్తారు అంటూ వ్యాఖ్యానించారు. రఘునందన్ రావు హరీష్ రావు బంధువులని… అందుకే రఘునందన్ రావు పార్టీ మారడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. సిద్దిపేట గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గంని మాత్రం ఎందుకు వదిలేసారు అంటూ ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version