జగన్ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేయించాడు: హనుమంత రావు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు అరెస్ట్ పైన తెలంగాణ నేతలు కూడా స్పందిస్తుండడం గమనార్హం. ఉదయం తెలంగాణ మంత్రులు హరీష్ రావు మరియు కేటీఆర్ లు స్పందించగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తనదైన శైలిలో మాట్లాడారు. హనుమంతరావు మాట్లాడుతూ… నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును ఏపీ సీఎం జగన్ అరెస్ట్ చేయించారంటూ కామెంట్ చేసారు. ఎలా అయితే ఈ దేశంలో మోదీ మరియు అమిత్ షా ప్రతీకార రాజకీయాలకు తెరలేపారో… ఇప్పుడు జగన్ అదే బాటలో నడుస్తున్నదంటూ హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కు ముందు ఏపీలో ప్రతీకార రాజకీయాలు లేవని.. జగన్ ప్రభుత్వం వచ్చాకనే ఎక్కువ అయ్యాయంటూ రెచ్చిపోయి మాట్లాడారు హనుమంతరావు.

ఇక గతంలో ఇందిరాగాంధీపై అనేక కేసులు పెట్టినా… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిపై కక్ష తీర్చుకోలేదని.. ఈ విధానం మారాలంటూ హనుమంతరావు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news