టెక్ మహీంద్రా లో ఖాళీలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ (ICSTP) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టెక్ మహీంద్రా. దీనిలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే అర్హత విషయం లోకి వస్తే.. డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 2015, 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులని స్వీకరిస్తోంది.

వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అలానే ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ (తప్పని సరి), కన్నడ (తప్పని సరి) భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 18. టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో ఇంటర్వ్యూ తేదీని చెబుతారు. అలానే సెలెక్ట్ అయ్యిన వారికి వేతనం ఏడాదికి రూ.1,64,000 ఇస్తారు. https://apssdc.in/industryplacements/ లో పూర్తి వివరాలని చూసి రిజిస్ట్రేషన్ చేసుకోచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news