భారీ వర్షానికి బస్సు ఎలా కొట్టుకుపోయిందో చూడండి..!

-

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనాలికి సమీపంలోని బియాజ్ నది కూడా ఉప్పొంగిపోతున్నది. ఇక.. మనాలి పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టు బస్సులను నది పక్కన ఆపారు. భారీ వర్షానికి నదికి వచ్చే వరద ఎక్కువ కావడంతో నది ఒడ్డు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో నది వెంబడే పార్క్ చేసిన ఒక బస్సు వెనుక నుంచి నదిలోకి ఒరిగిపోయింది. చూస్తుండగానే.. క్షణాల్లో బస్సు ఆ నది ప్రవాహానికి కొట్టుకొని పోయింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే.. బస్సులో ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news