గణపతికి డీజే, డాల్బీ సౌండ్స్ అవసరంలేదు: మహారాష్ట్ర సీఎం

-

లార్డ్ గణేశ్‌కు ఈ డీజే, డాల్బీ సౌండ్ సిస్టమ్స్, హైటెక్ సౌండ్ సిస్టమ్స్ లాంటివేమీ అవసరం లేదు. మన అవసరం కోసం మనకు ఉత్సాహం కోసం ఈ డీజేలాంటి సౌండ్ సిస్టమ్స్‌ను పెట్టుకున్నాం.. అని అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. మహారాష్ట్ర ప్రభుత్వం గణపతి ఉరేగింపు సమయంలో, గణపతి మండపంలో డీజేలను బ్యాన్ చేసింది. డీజే, డాల్బీ సౌండ్‌తో సౌండ్ పొల్యూషన్ చేయడమే కాకుండా.. చుట్టుపక్కన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బందులు సృష్టించకూడదని వాటిని ప్రభుత్వం బ్యాన్ చేసింది. బాంబే హైకోర్టు కూడా ప్రభుత్వానికి మద్దుతు తెలిపింది.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా.. తన ఇంట్లో గణేశ్‌ను నిమజ్జనం చేసిన అనంతరం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ముంబైలో కూడా ఆదివారమే గణేశ్ నిమజ్జనం కావడంతో డీజే బ్యాన్ ఇష్యూ తెరమీదికి వచ్చింది. దీనిపై చాలామంది గణేశ్ భక్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

సాంప్రదాయబద్ధమైన మ్యూజిక్‌ను ప్లే చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ డీజేల ద్వారా వచ్చే మ్యూజిక్ సౌండ్ పొల్యూషన్‌ను సృష్టిస్తుంది. గణేశ్ చతుర్థిని ఉత్సాహంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం డీజే ఉపయోగిస్తున్నారు. కానీ.. డీజే వల్ల కలిగే కాలుష్యాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పర్యావరణాన్ని రక్షించడం కూడా మన బాధ్యతే. అందుకే మన సాంప్రదాయాలు, పర్యావరణం గురించి మనం ఆలోచించాలి.. అని సీఎం చెప్పారు. అయితే.. సౌండ్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం.. అధికంగా సౌండ్ పెట్టకుండా.. చాలా తక్కువ సౌండ్‌తో డీజేలను వాడుకోవచ్చని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. దాని ప్రకారం గణేశ్ భక్తులు నడుచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news