వ్యాక్సినేషన్‌ నిబంధనలివే..!

-

కరోనా కట్టడికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, జాగ్రత్తలు, పలు సూచనలను కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ‘రూల్‌బుక్‌’ పంపించి, ఇందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. 18 ఏళ్లు నిండివారికే వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. బాలింతలు, మరియి గర్భిణులకు వ్యాక్సిన్‌ ఇవ్వరాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పాటించాల్సిన సూచనలు..

1. కోవిడ్‌–19 వ్యాక్సిన్లు మార్చుకునేందుకు అనుమతి లేదు.
2. మొదటిసారి ఏ సంస్థకు చెందిన డోస్‌ తీసుకున్నారో.. రెండోసారి కూడా అదే తీసుకోవాలి.

3. ప్లాస్మా చికిత్స తీసుకున్న రోగులు, ఆస్పత్రుల్లో రోగులను కలిసిన వారు, తీవ్రంగా అనారోగ్యాలతో బాధపడేవారు, వారు పూర్తిగా కోలుకున్న 4–8 వారాల తర్వాతనే వ్యాక్సిన్‌ ఇవ్వాలి
4. 18 ఏళ్లపైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ఒకవేళ వారు ఇతర వ్యాక్సిన్లు తీసుకోవాల్సి వస్తే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇతర వ్యాక్సిన్‌కు మధ్య దాదాపుగా 14 రోజల గడువు ఉండాలి.
5. వ్యాక్సిన్‌ తీసుకునే వారికి, వ్యాక్సిన్, మందులు, ఆహార పదర్థాల అలర్జీ ఉందేమోనని ముందుగానే తెలుసుకోవాలి. అలాంటి వారిపట్ట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
6. వ్యాక్సిన్‌ తీసుకుంటున్నప్పుడు, తీసుకున్న తర్వాత ఎలాంటి నొప్పి, బాధ అనిపిస్తే పారాసిటమల్‌ తీసుకోచ్చు.

దేశం మొత్తం మీద 3006 కేంద్రాల్లో శనివారం నుంచి వ్యాక్సిన్‌ ప్రారంభం కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలతో వేస్తారు. వ్యాక్సినేషన్‌ పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా ‘1075’ టోల్‌ ప్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version