డిసెంబర్ 6 ముక్కోటి ఏకాదశి. ఈరోజు దేశంలోని అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు ఉంటాయి. అయితే ఉత్తర ద్వార దర్శనం వల్ల ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం…
దక్షిణం యమస్థానమని, ఉత్తరం వైకుంఠ/కైలాస స్థానమని ప్రతీతి. ఏడాదిని రెండు భాగాలుగా విభ-జించినట్లే మానవ జీవితాన్ని కర్మ, జ్ఞాన భాగాలుగా విభజించారు. ఉత్తరద్వార దర్శనం అంటే లౌకిక బంధనాలను తొలగించుకొని జ్ఞాన మార్గం వైపు పయనించడం. వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వారద-ర్శనంతో మానవునికి కైవల్యం – మోక్షం – బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణ ప్రాశస్త్యం.
– కేశవ