BREAKING : ఎమ్యెల్యే వ‌న‌మా కొడుకు రాఘ‌వ అరెస్ట్‌..

-

కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌ అయ్యాడు. పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో వ‌న‌మా రాఘ‌వ‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాఘ‌వ‌ను స్వయంగా ఎమ్మెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు పోలీసుల‌కు అప్ప‌గించారు.

దీంతో రాఘ‌వ‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. కొత్త‌గూడెం పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వ‌న‌మా రాఘ‌వ ను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి పోలీసులతో టచ్ లో ఉన్న ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు.. తన కొడుకు రాఘవను పోలీసులకు అప్పగించారు. అయితే.. మీడియాతో మాట్లాడిన తర్వాత.. నన్ను అరెస్ట్ చేయాలని వనమా రాఘవ కోరగా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా.. ఈ ఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనును బాధకు గురిచేసిందని అన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందన్నారు. తన కొడుకు రాఘవేంద్ర దర్యాఫ్తుకు సహకరించేలా చేస్తానని అన్నారు. కేసులో నిజానిజాలు తేలే దాకా తన కొడుకును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version