వ‌న‌ప‌ర్తి మ‌హిళ‌తో ఎస్సై రాస‌లీల‌లు…అడ్డంగా దొరికిపోవ‌డంతో…!

పెళ్లైన మ‌హిళ‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుని ఓ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. దాంతో ఆ మ‌హిళ భ‌ర్త త‌న స్నేహితులు కలిసి చిత‌క‌బాధారు. ఈ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తిజిల్లా కొత్త‌పేటలో చోటు చేసుకుంది. కొత్త‌పేట‌కు చెందిన ఓ మ‌హిళ వ‌న‌పర్తి రూర‌ల్ ఎస్సై షేక్ ష‌ఫీ మ‌ధ్య అక్ర‌మసంబంధం వ్య‌వ‌హారం నడుస్తుంది. ఈ విష‌యం కాస్తా మ‌హ‌ళ భ‌ర్త‌కు తెలిసింది. దాంతో వారిని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని నిఘా పెట్టాడు.

vanaparthi rural si affair with women
vanaparthi rural si affair with women

ఈ క్ర‌మంలో త‌న ఇంటికి వ‌చ్చిన ఎస్సై ని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నాడు. అనంత‌రం త‌న స్నేహితుల‌తో క‌లిసి ఎస్సైని చిత‌క‌బాధాడు. ఎస్సై ఎంత వేడుకున్నా విన‌కుండా అత‌డిని చిత‌క‌బాధారు. ఇక విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని ఎస్సైని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. దాంతో ఎస్సై పై ప్ర‌తి ఒక్క‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్సై ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.