అండ చూసుకుని..జర్నలిస్టుపై రాధా ఫైర్

-

నిన్నటి వరకు అందరితో సఖ్యతగా మెలిగే దివంగత నేత వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడు వంగవవీటి రాధాకృష్ణ  వైసీపీకి రాజీనామా చేయడంతోనే అధికార పార్టీ అండ చూసుకున్నాడో ఏమో..జర్నలిస్టులపైనే తన ప్రతాపం చూపించారు. వైసీపీకి రాజీనామా చేసిన నాలుగు రోజుల తరవాత  గురువారం మీడియా ముందుకు వచ్చిన ఆయన…వైసీపీ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. తన తండ్రి ఆశయాల కోసం అవమానాలను భరించి వైసీపీలో కొనసాగానని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో  తన తండ్రి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లడానికి కూడా పార్టీ అధిష్టానం ఆంక్షలు పెట్టడం భరించలేక బయటికి వచ్చేశానని వెల్లడించారు.

ఈ క్రమంలో జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడుగుతూ.. ‘టీడీపీలో రంగా గారి ఆశయాలు నెరవేరుతాయని అనుకుంటున్నారా?’ అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా .. ఒక్క సారిగా అగ్నిహోత్రుడై.. వేలు చూపిస్తూ.. ‘ఏయ్ తెలుగుదేశం నీకు అదే చెప్పింది. నువ్వు ఏ టీవీ అయినా అయ్యుండొచ్చు. నీ టీఆర్పీ కోసం నేను మాట్లాడటంలేదు. 30 సంవత్సరాల పాటు ఆయనపై అభిమానం మోసుకుంటూ తిరిగారు ప్రజలు. ఆయన ఆశయం నెరవేర్చడానికి మోసారు. ఎవరు నెరవేరిస్తే వారిని నెత్తినపెట్టి చూసుకుంటారు. అది ఏ పార్టీ అయినా సరే. జాలి చూపించేవారిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న పాత్రికేయ మిత్రులు ఒక్కసారిగా విస్మయం చెందారు. అధికార పార్టీలో చేరుబోతునందు వల్లనేమో… రాధా ఇంతగా రెచ్చిపోతున్నారంటూ.. చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news