బిగ్ బాస్ సెట్ ను అలా వాడేస్తున్నారట..!

-

స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అందరికి తెలిసిందే. ఆ షో నడుస్తున్నంత కాలం చూసే వాళ్లకు మంచి టైం పాస్.. బయట గొడవలు సరిపోక ఆ ఇంట్లో వాళ్లు గొడవలకు ఆడియెన్స్ తెగ ఫీలై పోతుంటారు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసి సక్సెస్ అందుకోగా సెకండ్ సీజన్ లో హోస్ట్ గా నాచురల్ స్టార్ నాని కూడా మెప్పించేశాడు.

బిగ్ బాస్ సీజన్ 1 పూణెలో సెట్ వేశారు. అందుకే మొదటి సీజన్ ఎవరు విన్నర్ ఎవరు ఎలిమినేటర్ అన్నది లైవ్ లో చూస్తేనే తెలిసేది.. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేయడం వల్ల అక్కడ పనిచేసే టెక్నిషియన్స్ వల్ల ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది ముందే తెలిసేది. అఫ్కోర్స్ సెకండ్ సీజన్ అంతా కౌశల్ మాయలో వెళ్లిపోయింది అనుకోండి.

ఇదిలాఉంటే బిగ్ బాస్ 3 కూడా మళ్లీ అక్కడే నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టంట్స్ ఎంపికపై చర్చలు మొదలుపెట్టారట. అయితే హైదరాబాద్ లోని బిగ్ బాస్ సెట్ షో నడవకున్నా సరే డబ్బులు సంపాదిస్తుందని తెలుస్తుంది. ఆ సెట్ లో టివి సీరియల్స్ షూటింగ్ చేస్తున్నారట. సెట్ పెద్దదే కాబట్టి సీరియల్స్ కు బాగా ఉపయోగపడుతుందట. బిగ్ బాస్ మళ్లీ మొదలయ్యేదాకా షో నడవకున్నా సరే ఆ సెట్ వాడుకున్నందుకు డబ్బులు మాత్రం రాబడుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news