సమంతకు వనితా విజయ్ కుమార్ సపోర్ట్..!

టాలీవుడ్ నటి సమంత చైతూ నుండి విడిపోయిన తర్వాత అమేపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సమంత కు ఎఫైర్ ఉందని…పిల్లలను వద్దు అనుకుంది అని అనేక రకాల వార్తలు వచ్చాయి. నెటిజన్లు కూడా సమంత పైనే విమర్శలు కురిపిస్తున్నారు. సమంత కు సంసారం వద్దు సినిమాలే కావాలి అంటూ నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. దాంతో సమంత ఎమోషనల్ అయ్యింది. ఎంతో ఆవేదన తో సొసైటీ పై అవేదన తో నాకు అఫైర్లు ఉన్నాయని రాస్తున్నారు…అబార్షన్ చేయించుకున్నా అంటున్నారు. నన్నే టార్గెట్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ సమాజం మగవాళ్ళు తప్పు చేస్తే ఒకలా చూస్తుంది..ఆడవాళ్ళు తప్పు చేస్తే ఒకలా చూస్తుంది అంటూ సామ్ పేర్కొంది. కాగా ఈ పోస్ట్ ను షేర్ చేసిన వనితా విజయ్ కుమార్…అసలు సమాజమే లేదు బేబీ…నీ జీవితాన్ని నువ్వు ఆశ్వాదించు. ఈ సమాజం మనం తీసుకున్న ఫోటోలను మాత్రమే చూస్తుంది. దాని వెనక ఉండే వీడియో ను చూడదు. జీవితం ఎంతో గొప్పది. ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుంది. ముందుకు వెళుతూ ఉండు. అంటూ వనితా తన ట్వీట్ తో సామ్ కు సపోర్ట్ ఇచ్చింది.