ఇంధన సంక్షోభంపై ప్రధానికి జగన్మోహన్ రెడ్డి లేఖ

-

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోవాలని సీఎం లేఖ రాశారు. కోవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. గత నెల రోజుల్లో విద్యుత్ వినియోగం 20 శాతం పెరిగిందని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో థర్మల్ కేంద్రాల వద్ద 1-2 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయన్నారు. విద్యుత్ కొనాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్ కు రూ. 20 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో వివరించారు. ఏపీలో రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. కేంద్ర విద్యుత్ ప్లాంట్లలోనూ 75 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ప్రధాని ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మోదీని సీఎం జగన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news