ఇక రోడ్లపై రై రై.. త్వరలో వాహనాల వేగపరిమితి సవరణ బిల్లు..!

ఇక రోడ్లపై వాహనాలు రై..రై..న దూసుకుపోయేలా కేంద్రం నిర్ణయం తీసుకునే ఉంది. ఇండియా టుడే కాంక్లేవ్ 2021లో ఆయన దేశంలో వివిధ రోడ్లపై వాహనాల వేగాన్ని పెంచుతూ పార్లమెంట్ లో బిల్ తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివిధ కేటగిరీ రోడ్లపై వాహనాల వేగాలను సవరించేందుకు ఫైల్ సిద్ధం చేసినట్లు గడ్కరీ వెల్లడించారు. ఇండియాలో రోడ్లపై కార్లు వేగంగా వెలితే ప్రమాదాలు జరుగుతాయనే మనస్తత్వం ఉందని అన్నారు. భారత దేశంలో వాహనాల వేగ పరిమితులు పెద్ద సవాళ్లతో కూడుకున్నామని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

 ఎక్స్ ప్రెస్ హైవేలపై వాహనాల వేగం గంటకు 140 కిలోమీటర్లకు అనుకూలంగా ఉన్నాయని గడ్కరీ అన్నారు. జాతీయ రహదారులు, నాలుగు వరసల రహదారులపై వేగపరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉండాలని, రెండు వరసల రహదారులపై  గంటకు 80 కిలోమీటర్లు, నగరాల్లో రహదారులపై గంటకు 75 కిలోమీటర్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశంలో వాహనాల వేగంపై సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ నిర్ణయాలు, తీర్పులు ఉన్నాయని దీని వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇండియాలో ఎక్స్ ప్రెప్ హైవేలపైకి కనీసం కుక్కలు కూడా రాకుండా ఇరువైపులా బారికేడ్లు ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలోని రోడ్లపై వాహనాల వేగాల పరిమితులను సవరించేందుకు పార్లమెంట్లో బిల్లును తీసుకువస్తామని ఆయన అన్నారు.