వరలక్ష్మీ వ్రతం విశిష్టత .. పూజ సామగ్రి, పూజా విధానం

-

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. Varalakshmi Vratham

varalakshmi vartham | వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
varalakshmi vartham | వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. మరి అంతటి విశిష్టత ఉన్న వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం రోజు ఎప్పుడు వస్తుందంటే.. పున్నమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. ఆ రోజున ఉదయమే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. అనంతరం ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడలో అలకాలి. తర్వాత అక్కడ ముగ్గులు పెట్టి… మండపాన్ని తయారు చేయాలి. ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా అలంకరించి ఆ బియ్యం మీద కలశాన్ని ఉంచాలి. వీలైలే మామిడి, మర్రి, మేడి, జువ్వి, రావి ఆకుల్లో ఏదైనా ఒకటి అందులో వేయాలి. కలశంపై కొబ్బరి కాయ పెట్టి జాకెట్ ముక్కను దానికి చుట్టాలి.

శ్రీ వరలక్ష్మీ వ్రతం – పూజ సామగ్రి

  • పసుపు – 100 గ్రాములు
  • కుంకుమ-100 గ్రాములు
  • గంధం- 1 డబ్బా చిన్నది
  • విడిపూలు- అరకిలో
  • పూల మాలలు-6
  • తమలపాకులు- 30
  • వక్కలు- 100 గ్రాములు
  • ఖర్జూరములు-50 గ్రాములు
  • అగర్బత్తి – ఒక ప్యాకెట్
  • కర్పూరము-50 గ్రాములు
  • చిల్లర పైసలు – ముప్పయి రూపాయి బిళ్లలు
  • తెల్ల టవల్-1
  • రవిక గుడ్డలు- 2
  • మామిడి ఆకులు- తగినన్ని
  • అరటిపండ్లు – 1 డజను
  • ఇతర రకాల పండ్లు – ఐదు
  • అమ్మవారి ఫోటో- ఒకటి
  • కలశము – ఒకటి
  • కొబ్బ‌రి కాయలు – మూడు
  • తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం
  • తియ్యని ప్రసాదాలు, వీలైతే రెండు రకాలు
  • బియ్యం – రెండు కిలోలు
  • కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 మి.లీ

ఈ పూజా సామాగ్రి శుభ్రం చేసి ఉంచుకోవాలి

దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్స్, ట్రేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, గిన్నెలు.

ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీని కీర్తించాలి. ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్టోత్తరశత నామాలతో వరలక్ష్మీకి అర్చన చేయాలి. అష్టోత్తర శతనామాల్లో 108 కథలు ఉంటాయి. బ్రహ్మవైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి కంకణాలను తయారు చేసి అమ్మవారికి అర్చించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇంటి సభ్యులందరికీ కంకణాలను కట్టాలి. భక్తితో నమస్కారాలు చేసి ఇంటికి ముత్తయిదువులను పిలిచి వాళ్లకు వాయినాలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో వరలక్ష్మీ వ్రతం పూర్తవుతుంది.

Varalakshmi Vratham in Telugu PDF - manalokam.com
Varalakshmi Vratham in Telugu PDF – manalokam.com

చాలామందికి వ్రతవిధానం తెలియక వ్రతం చేసేవారు లేక , తమకు తోచిన విధంగా మమా అనిపిస్తారు. అటువంటి వారందరు శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి మన లోకం సవివరమైన వరలక్ష్మి వ్రత కల్పం PDF పిడిఎఫ్ (https://bit.ly/2BmG86S)‌ రూపంలో మీకు అందిస్తుంది.  ఈ పుస్తకంలో వరించిన విధానంలో లో వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్ధన ఇట్లు మన లోకం

 

 

Read more RELATED
Recommended to you

Latest news