విడ్డూరం: అచ్చం మనిషి ముఖం పోలిన చేప ..!

-

ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక వింత మనకు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. ఇదే నేపథ్యంలో తాజాగా అచ్చం మనిషి లా పోలి ఉన్న చేప ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ చేప మలేషియా జాలర్లకు రోజులాగే చేపల వేటకు వెళ్ళిన సమయంలో దొరికింది. అయితే ఓ చేపలు పట్టే వ్యక్తి ఆ చేపను పట్టుకొని వెరైటీ గా ఉందని గమనించి, ఇది ఎందుకు ఇలా ఉందని అనుకొని దగ్గర్లోని ఓ చేపల పరిశోధన కేంద్రానికి ఆ చేపను తీసుకు వెళ్ళాడు. అతను తీసుకువెళ్లిన చేపను పరిశోధకులు చూడగానే వావ్… ” ట్రిగ్గర్ ఫిష్ ” భలే ఉంది అంటూ అన్నారు.

fish
fish

ఇక దాంతో ట్రిగ్గర్ ఫిష్ అంటే అర్థం కాని మత్స్యకారుడు, వెంటనే పరిశోధకులతో ఇవి ఎలాంటి చేపలని అడగగా… దానికి ప్రపంచంలో భూమి మీద అనేక రకాల జీవులు ఉన్నాయి కదా… అందులో ఇది ఒకటని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఆ చేపలు పట్టుకునే వ్యక్తి వంతు అయింది. అయితే ఈ చేపలు కాస్త అరుదైనవి అని, అది కూడా కేవలం ఆస్నేయ ఆసియా సముద్ర జలాల్లో మాత్రమే లభిస్తాయని, ఈ చేపలు పెద్ద పెద్ద పెదాలు కలిగి ఉండి బలమైన దవడలు ఉండి, దంతాలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయని తెలియజేశారు. ఇవి చూడటానికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news