వామ్మో ఎంత పెద్ద కింగ్ కోబ్రానో …!

-

మామూలుగా మనం మూడు, నాలుగు అడుగులు ఉన్న పామును చూస్తేనే భయంతో దడుచుకుంటారు. అది కాస్తా కొద్దిగా పెద్దగా ఉంటే ఉన్న చోటే ప్రాణాలు పోయినట్టే అవుతుంది. అలాంటిది ఇక 15 అడుగుల కింగ్ కోబ్రా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. అవును తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో 15 అడుగుల కింగ్ కోబ్రా ఓ పొలం దగ్గర్లో ఉన్న గుడిసెలోకి చొరబడింది. అయితే అదృష్టవశాత్తు దానిని ఆ పొలంలో పనిచేస్తున్న రైతు చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

snake
snake

ఇక ఈ సమాచారాన్ని అందుకున్న అటవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, ఆ పామును ఓ సంచిలో బంధించారు. నిజానికి అంత పెద్ద కింగ్ కోబ్రా ను చూడడంతో అటవీ సిబ్బంది కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఇలాంటి పెద్ద పరిమాణం ఉన్న కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా మాత్రమే కనబడతాయి అని వారు తెలియజేశారు. ఆ పామును పట్టుకున్న అటవీ అధికారులు దానిని తీసుకువెళ్లి సిరువని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Read more RELATED
Recommended to you

Latest news