నాగశౌర్య “వరుడు కావలెను” నుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం “వరుడు కావలెను” అనే సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగశౌర్య కు జోడీగా హైదరాబాద్ అమ్మాయి రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సినిమాను వంశీ నిర్మిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్ తో పాటు తదితరులు నటించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా కు సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి “వడ్డాణం చుట్టేసి వచ్చరే భామలు” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటలో పెళ్లి సందడి కనిపిస్తోంది. నాగ శౌర్య… రీతు వర్మ తో కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ఈ సాంగ్ లిరిక్స్ మరియు మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నాగ శౌర్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version