తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా వీరిద్దరూ బయటపడలేదు. పైగా తమ మధ్య ఏమి లేదు అన్నట్టుగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ చివరికి పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇకపోతే వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం గాండీవదారి అర్జున.. ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ ను మీడియా రిపోర్టర్స్ లావణ్యతో ప్రేమా , పెళ్లి గురించి పలు ప్రశ్నలు అడిగి.. ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలను బయటకు లాగారు.
ఇకపోతే తమ బంధం పబ్లిక్ లో పెట్టడం ఇష్టం లేక ప్రైవసీ మెయింటైన్ చేశామని చెప్పిన వరుణ్ తేజ్.. మొదట్లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాము.. ఆ తర్వాతే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాము అంటూ చెప్పుకువచ్చారు. మరి పెళ్లెప్పుడు అని అడగ్గా ఇప్పుడే కాదండి నేను డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.. ఇంకా విడుదల అవ్వాల్సిన నా సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి.. అన్నీ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అయితే నా పెళ్లి హైదరాబాదులోని చేసుకోవాలని ఉంది కానీ కొన్ని కారణాలవల్ల వేరే దేశంలో లేదా వేరే రాష్ట్రంలో పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని త్వరలోనే చెబుతాను అంటూ తెలిపారు వరుణ్ తేజ్.