‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కోసం వరుణ్ తేజ్ డెడికేషన్ మాములుగా లేదుగా……!

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత మూడేళ్లుగా ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆకట్టుకోలేక పొతున్నాడు. ఇక తాజాగా ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు.కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకి రెడీగా ఉంది.

 

ఇక ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చాలా డెడికేషన్ చూపిస్తున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ లో తన సినిమా పై హైప్ పెంచేందుకు చాలా కష్టం పడుతున్నారు. కేవలం ఈ రెండు రోజుల వ్యవధిలోనే వరుణ్ ఏకంగా 26 ఇంటర్వ్యూ లు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దీంతో తాను ఈ సినిమా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news