బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

-

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వరుసగా పలువురు కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు. మరోవైపు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక తాజాగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కూడా బీఆర్ఎస్ను వీడనున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో బొంతు రామ్మోహన్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఆ విషయమై రేవంత్తో చర్చలు జరిపేందుకు ఆయణ్ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే బొంతు రామ్మోహన్ మల్కాజిగిరి ఎంపీ టికెట్ను ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకే సీఎంతో భేటీ అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news