ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. టీమ్ ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ దూరమయ్యారు. గాయంతో రెండో టెస్టుకు దూరమైన లీచ్ మిగతా మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడం లేదు. మోకాలి గాయంతో బాధపడుతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంకా కోలుకోలేదు.దాంతో, మెరుగైన చికిత్స కోసం జాక్ లీచ్ స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం ఇంగ్లీష్ టీం మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
కాగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా లీచ్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఆయన సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.మ్యాచ్ అనంతరం విశ్రాంతి తీసుకున్న లీచ్ విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టుకు టెస్టుకు దూరమయ్యాడు. కీలకమైన మూడో టెస్టుకు 12 రోజుల విరామం ఉండడంతో జాక్ లీచ్ అందుబాటులో ఉంటాడని ఇంగ్లండ్ యాజమాన్యం భావించింది.కానీ, జాక్ లీచ్ కోలు కోకపోవడంతో ఇంగ్లండ్‌కు పంపించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.