వాస్తు: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాస్తు చిట్కాలని అనుసరిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకుంటున్నారు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. మరి పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

 

 

తులసి మొక్కని పూజించడం వలన ఎంతో మంచి కలుగుతుంది. తులసి నీళ్ల వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. తులసి ఆకులను మీరు రాగి పాత్ర లో కానీ కంచు దానిలో కానీ వేసి నీళ్లు వేస్తే పవిత్రంగా మారుతుంది. పైగా లక్ష్మీ దేవికి కూడా నచ్చుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది.

రాత్రంతా తులసి ఆకులని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్ళని ఇంట్లో ప్రతి మూల జల్లండి ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కృష్ణుడికి కూడా తులసి అంటే ఎంతో ఇష్టం కృష్ణుడికి కూడా మీరు తులసిని పెట్టొచ్చు. తులసి నీళ్ల తో కృష్ణుడికి అభిషేకం చేయొచ్చు అలానే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా విజయం పొందాలన్నా తులసి నీళ్ళని ఉపయోగించొచ్చు. దీనికోసం మీరు రెండు లేదా మూడు రోజులు తులసి ఆకులని నీళ్లలో ఉంచి ఆ నీటిని మీ మీద జల్లుకోండి. అలానే మీ షాపు లో కానీ పని చేసే చోట కాని జల్లండి ఇది నెగిటివ్ ఎనర్జీ ని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version