వాస్తు: ఈ దిక్కుల్లో చెప్పులు వదిలితే ప్రాణగండం.. జాగ్రత్త..

-

చాలా మంది వాస్తును నమ్ముతారు. వాస్తు ప్రకారమే అన్ని ఉండాలని కోరుకుంటారు.. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుందని పెద్దలు పదే పదే చెబుతారు. ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా వాస్తును పాటిస్తారు. అంతేకాదు ఇంట్లో ఉంచే వస్తువులు ఎక్కడ ఉంటే కుటుంబంలో మేలు జరుగుతుందో వాస్తు వివరంగా బోధిస్తుంది. ఇంట్లో వాస్తు సంబంధిత నియమాలు పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. వాస్తు దోషంతో అన్నీ అనర్థాలే జరుగుతాయి.

శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కుటుంబంలో శాంతి సమాధానం లోపించి గొడవలు ప్రారంభమవుతాయి.. ఈరోజుల్లో ప్రతి వస్తువులాగే చెప్పులు కూడా వాస్తు ప్రకారమే ఉంచాలి.. ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

చెప్పులు, బూట్లు నిత్యం మనం ధరించి తిరుగుతాం. అయితే ఇంట్లో పాదరక్షలు సరైన దిశలో ఉంచకపోతే అనర్థాలు తప్పవని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది. ఉంచాల్సిన ప్రదేశంలో ఉంచకుంటే అనర్థాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయట. ఇంట్లో చెప్పులు లేదా బూట్లు ఎప్పుడూ తలకిందులుగా ఉంచరాదు. శని పాదాలకు సంబంధించిందని విశ్వసిస్తారు. పాదరక్షలు సరిగ్గా ఉంచకపోతే అశుభ ప్రభావం కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. పాదరక్షలు ఎప్పుడూ పడమర వైపు మాత్రమే ఉంచాలని వాస్తు ఘోషిస్తోంది..

ఇక ఇంట్లో విరిగిన చెప్పులు లేదా బూట్లు ఉంటే వాటిని దూరంగా విసిరేయాలి. అలాంటి పాదరక్షలు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వంటగది గోడకు లేదా పూజ గదికి ఆనుకుని ఉండకూడదు. ఇలా ఉంచితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.నైరుతి, వాయువ్య దిశలు షూ ర్యాక్ తయారు చేసేందుకు ఉత్తమమైనవని గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version