వాస్తు: పెనం మీద నీళ్లు జల్లే అలవాటుందా..? దీన్ని చూస్తే అలా చెయ్యరు..!

-

వాస్తు ప్రకారం తప్పులు చేయకుండా ఉంటే ఏ సమస్యా లేకుండా ఉండొచ్చు. చాలామంది వాస్తు శాస్త్రాన్ని అనుసరించారు. దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంట్లో ఉండే పెనం పట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలి అనే దాని గురించి వాస్తు పండితులు చెప్పారు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం.

ప్రతి ఒక్కరి వంటగదిలో కూడా పెనం ఉంటుంది. రోటీలు చేసుకోవడానికి, దోశలు వేసుకోవడానికి పెనం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా పెనం లోపల పెట్టుకోవాలి. బయట ఎప్పుడూ వదలకూడదు. అదే విధంగా పెనం మీద ఎప్పుడూ కూడా సాల్ట్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అలానే ఎప్పుడైనా పెనం మీద రోటీ, చపాతి చేస్తే ముందు దానిని ఏదైనా జంతువుకి పెట్టాలి. ఆ తరవాతే మనం తినాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇంట్లో వేడి వేడి పెనం మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు ఎందుకంటే పెనం మీద నీళ్లు చల్లడం వల్ల పెళ్లప్పుడు వర్షం పడుతుంది అని అంటుంటారు. మరికొందరైతే అలా నీళ్లు చల్లడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆనందంగా ఉండలేరు అని అంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా పెనం విషయంలో ఈ తప్పులు చేయకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version