హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజల మనసులో ప్రశ్నలు వస్తున్నాయి.- సంజయ్ రౌత్, శివసేన

-

దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంతో మరణించిడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది. బిపిన్ రావత్ తో పాటు మరో ఆయన సతీమణి మధులిక రావత్ తో పాటు మరో 11 మంది మరణించారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో కూనూర్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తున్న క్రమంలో బుధవారం ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తాజాగా ఈ సంఘటనపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్య స్వామి ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

తాజాగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇదే విధంగా హెలికాప్టర్ ప్రమాదంపై రియాక్ట్ అయ్యారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్విట్ చేశాడు. ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌ని, దేశ సుప్రీం క‌మాండ‌ర్ సుర‌క్షిత‌మైన ఆధునిక హెలికాఫ్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని, టాప్ క‌మాండ‌ర్‌ను ప్ర‌మాదంలో ఎందుకు కోల్పోయామ‌ని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌ని శివ‌సేన ఎంపీ గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం కూడా ఈ షాక్ నుండి బయటపడలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version