వాస్తు టిప్‌.. దుర్గాపూజకు ఇవి అస్సలు వాడకండి!

-

ఈ రోజు నవరాత్రి ప్రత్యేక వాస్తు శాస్త్రం గురించి తెలుసుకుందాం. దేవుళ్ల ప్రతిమలకు ఏ పూలను వాడాలి! ఏ పూలతో పూజించి వారిని మనం ప్రసన్న ం చేసుకోవచ్చో చూద్దాం.సాధారణంగా మనం నవరాత్రుల్లో దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తాం. వివిధ రకరాలు పూలను వాటి సువాసనలు, రంగులు దేవత, దేవుళ్లకు ప్రత్యేకించి వాడాలి. అదేవిధంగా కొన్ని వాడటం నిషిద్ధం అని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.

భారతీయ సంప్రదాయాల ప్రకారం దుర్గా మాతకు నందివర్ధనం, జిల్లేడు, పారిజాత పుష్పాలతో దుర్గామాతను పూజించ వద్దు. అదేవిధంగా నాగచంపా, బృహతి, తంగేడు కూడా నిషిద్ధమైనవి. గంటను కూడా దుర్గామాత పూజకు వాడకూడదు అంటారు. కేవలం తామరపుష్పం, సంపెంగ పువ్వులతోనే దుర్గామాతను పూజించటం మంచిది. అలాగే విష్ణుమూర్తికి కూడా తెల్లటి లేదా పసుపుపచ్చని పూలు అత్యంత ప్రీతికరమట. విష్ణుమూర్తికి అక్షింతలు వాడకూడదు అంటే బియ్యం, జిల్లేడు, ఉమ్మెత్తపుష్పాలు వాడుకూడదు. ఇక సూర్య భగవాణుడు, వినాయకుడు, భైరవుడికి ఎర్రటి పుష్పాలతో అర్చించాలి. శివుడికి తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి.

Read more RELATED
Recommended to you

Latest news