వాస్తు: ఇంట్లో సమస్యలని ఇలా తొలగించండి..!

-

మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా..? అయితే తప్పకుండా వాస్తు పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. వీటిని కనుక పాటించారు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివిటీ ఉంటుంది.

ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నా లేదా ఏమైనా ఇతర సమస్యలు కలుగుతున్న కూడా అవి తగ్గిపోతాయి. అలానే ఆనందంగా ఉండొచ్చు. పైగా ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు మరి ఇంక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ వాస్తు టిప్స్ గురించి ఇప్పుడే చూసేయండి.

వినాయకుడు:

వినాయకుడు విగ్రహం ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదే విధంగా సమస్యలు కూడా దూరం అయిపోతాయి. మీ ఇంట్లో ముఖ ద్వారానికి ఎదురుగా వినాయకుడి విగ్రహాన్ని పెట్టండి. లేదా ముఖద్వారానికి వినాయకుడి పెయింట్ వేయించండి. ఇలా చేయడం వల్ల నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది. దీనితో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆనందంగా కూడా ఉంటారు.

తులసి మొక్క:

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉంచడం మంచిది. తులసి మొక్కని ఉంచి ప్రతిరోజూ దీపాన్ని పెట్టడం వల్ల నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది. అదే విధంగా ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.

కాబట్టి తులసి మొక్కని మీ ఇంట్లో ఉంచి రెగ్యులర్ గా దీపాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆనందంగా ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. కాబట్టి పండితులు చెబుతున్న ఈ చిన్నచిన్న టిప్స్ ని తప్పకుండా పాటించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version