వాస్తు: నేమ్ ప్లేట్ ని ఇంటి ముందు పెట్టేటప్పుడు.. ఈ తప్పులని చెయ్యకండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు దోషాలు మొదలు అన్ని సమస్యలు దాకా అన్నిటిని కూడా మనం వాస్తు తో దూరం చేసుకోవచ్చు ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పంచుకోవడం జరిగింది. మరి వాటి కోసమే ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది వాళ్ళ ఇంటి బయట నేమ్ ప్లేట్లని పెడుతూ ఉంటారు. ఇంటి యజమాని పేర్లు రాయడం లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు రాయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే నేమ్ ప్లేట్ ని ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా వీటిని గుర్తు పెట్టుకొని తీరాలి. ఇంటి ముఖద్వారం దగ్గర నేమ్ ప్లేట్ ని పెట్టేటప్పుడు ఎత్తు విషయంలో పొరపాటు చేయకూడదు.

మీ ఇంట్లో అందరికంటే ఎత్తుగా ఉండే వ్యక్తి ఎత్తు దాటి పెట్టాలి. ఇలా చేయడం వలన మంచి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారం నేమ్ ప్లేట్లను తయారు చేయించేటప్పుడు మెటల్, గ్రానైట్, మార్బుల్, చెక్క వంటి వాటిని మీరు తయారు చేయించుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ తో చేసిన వాటిని మాత్రం పెట్టొద్దు. ఇది నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది ప్లాస్టిక్ తో చేసిన వాటిని మీరు పెడితే అది మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

అలానే నేమ్ ప్లేట్ యొక్క రంగు కూడా చాలా ముఖ్యం. మీ ఇల్లు తూర్పు వైపు ఉన్నట్లయితే పసుపు, ఆకుపచ్చ, పింక్, కాషాయం వంటి రంగులని ఉపయోగించవచ్చు. ఇది మీ యొక్క గౌరవాన్ని పెంపొందిస్తుంది. అలానే నీలం రంగు ఆకుపచ్చ రంగు నేమ్ ప్లేట్లను కూడా పెట్టుకోవచ్చు. దక్షిణ వైపుకి మీ ఇల్లు ఉన్నట్లయితే ఎరుపు, ఆరెంజ్, పింక్, పర్పుల్ రంగులని ఉపయోగించవచ్చు. తెలుపు, బంగారం రంగు నేమ్ ప్లేట్లను కూడా వాడొచ్చు. ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే కచ్చితంగా సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version