హైకోర్టు తరలింపుపై ఏపీ హైకోర్టు అభిప్రాయాలను వెల్లడించాలి : కేంద్రం

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పలు కీలక విషయాలను వెల్లడించింది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలు జిల్లాకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పునర్విభజన చట్టం ప్రకారమే.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని తెలియజేసింది. సీఎం జగన్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని.. అయితే సీఎం మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతికేరకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్రం తన సమాధానంలో వెల్లడించింది. గతంలోనూ కేంద్రం ఇదే రకమైన సమాధానం ఇచ్చింది. గత ఆగస్టులో దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ విషయంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని ఆ తర్వాతే కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వాలని వ్యాఖ్యానించింది.

వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందన్నారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వమే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని ఆయన చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version