మాధవన్ కుమారుడి మరో క్రేజీ రికార్డు.. ఏకంగా 5 గోల్డ్​మెడల్స్ సాధించిన వేదాంత్

-

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హంక్స్ లిస్టు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చే పేరు మాధవన్. 90లలో సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపి ఊపేశాడు. అబ్బాయంటే ఇలాగే ఉండాలంటూ అమ్మాయిలు బల్లగుద్ది మరీ మాధవన్ పేరు చెప్పేవారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాధవన్. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది మాధవన్ గురించి కాదు. ఆయన కుమారుడు వేదాంత్ మాధవన్ గురించి. ఎందుకంటే..?

వేదాంత్ తాజాగా ‘మలేషియన్‌ ఇన్విటేషనల్‌ ఏజ్‌ గ్రూప్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో పాల్గొని ఐదు బంగారు పతకాలు సాధించాడు. ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌(50మీ, 100మీ, 200మీ, 400మీ, 1500మీ) లో ఏకంగా 5 స్వర్ణాలు సాధించాడు. కుమారుడి గెలుపుతో మాధవన్‌ సంతోషంలో మునిగిపోయారు. ఇన్‌స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘’దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్‌ గెలుపొందాడు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని భారత్‌కు 5 స్వర్ణాలు అందించాడు. వేదాంత్‌ను చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. అతడికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’’’ అని మాధవన్‌ పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news