వెజ్,నాన్ వెజ్ ఒకే దగ్గర.. టోలిచౌకిలో 4 సీజన్స్ రెస్టారెంట్‌పై రైడ్స్

-

హైదరాబాద్‌లో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా దాడులు జరిపారు.టోలిచౌకి నాలుగు సీజన్స్‌ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు జరిపారు. అయితే, అందులో వెజ్,నాన్‌వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వండుతున్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా కిచెన్‌లో బొద్దింకలను సైతం గుర్తించినట్లు సమాచారం. వెజ్,నాన్ వెజ్ ఐటమ్స్‌ అన్ని ఒకే దగ్గర కలిపి రెస్టారెంట్ యాజమాన్యం నిల్వ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, హోటల్ నిర్వాహకులు, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news