వైసీపీ మంత్రి విశ్వ‌రూపం.. టీడీపీలో పెద్ద చ‌ర్చ‌..!

-

వైసీపీకి చెందిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. టీడీపీని, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు.. భారీ ఎత్తున దుమ్ముదులిపారు. లోకేష్‌పై విరుచుకుప డ్డారు. ఇటీవ‌ల శాస‌న మండ‌లి ప‌రిణామాల‌ను మ‌న‌సులోంచి తీసేయ‌లేక పోతున్నారో ఏమో  లోకేష్‌పై నిప్పులు చెరిగేశారు. నారా లోకేష్ చౌదరికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌లు చేశారు.

‘ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతో లోకేష్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు. ప్రజల సమస్యలను పరిష్క రించే సీఎం వైఎస్‌ జగన్ నిజమైన బాహుబలి. మీరందరూ కాలకేయుల్లాంటోళ్లు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్‌ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా. గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చెయలేదా. లోకేష్‌ను కూడా టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి`-అంటూ.. వెల్లంప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కుమ్మ‌రించారు.

అంతేకాదు, మంగళగిరికి- మందలగిరికి, జయంతికి- వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. వంగవీటి రంగను నడిరోడ్డుపై చంపిచింది ఎవరు? టీడీపీ అధికారంలో ఉన్నపుడే వంగవీటి రంగాను హత్య చేయించలేదా..? హత్యా రాజకీయాలకు పేరు ప్రఖ్యాతులు గడిచింది నారా చంద్రబాబు కాదా?’ అని మంత్రి ప్ర‌శ్నించారు.నిజానికి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు గ‌తంలో వెల్లంప‌ల్లి నుంచి ఎప్పుడూ విన‌ని టీడీపీ నాయ‌కులు నివ్వెర పోయారు.

పైగా వెల్లంప‌ల్లి లోకేష్‌ను ప‌రామ‌ర్శిస్తారు.. అనే వ్యాఖ్య మ‌రింత‌గా టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో వెల్లంప‌ల్లి వ్య‌వ‌హారంపై ఏం చేద్దాం.. ఎవ‌రు స్పందిస్తారు?   అని నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న  ప‌డుతున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి సౌమ్యుడు, నిదానంగా ఉంటారు.. అనుకున్న వెల్లంప‌ల్లి ఒక్క‌సారిగా రెచ్చిపోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం. ఇదే ధోర‌ణి కొన‌సాగితే.. మున్ముందు మ‌రింత‌గా టీడీపీ నాయ‌కులు ఇబ్బందిలో ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version