కేటీఆర్ నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. స్పైడర్ మాన్ లాగా నువ్వు చేసే విన్యాసాలు జిమ్మిక్కులు జనం నమ్మరని అన్నారు. ఆకుపచ్చని వజ్రం లాంటి వారు రేవంత్ రెడ్డి ముందు నీ వేషాలు పనిచేయవు అన్నారు. కేటీఆర్ కి స్క్రీజోఫ్రీనియా అనే వ్యాధి ఉందని అందుకే బ్రహ్మ లో బతుకుతున్నారని అన్నారు. కేటీఆర్ మీడియాకి సమాధానం చెప్పలేక చీకటి గదిలో వీడియోలు చేసి పెడుతున్నారని సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టి నేను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాడని చెప్పారు. సీఎం కూర్చి పోయిందన్న అక్కసు తో రేవంత్ రెడ్డి పై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం నేమ్ బోర్డులు తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకుని సంతృప్తి పడాలని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజల స్పందన ఏంటో తెలుస్తుంది అని అన్నారు నీకు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేయని. సిరిసిల్లలో మా మహేందర్ రెడ్డి పోటీకి పెట్టి నిన్ను ఇంటికి పంపిస్తామని అన్నారు.