తెలంగాణ లోని టీఆర్ఎస్ పార్టీ కి చెందిన బండ ప్రకాశ్ రాజీనామా ను ఈ రోజు రాజ్య సభ చైర్మెన్ వెంకయ్య నాయుడు ఆమోదించారు.. కాగ బండ ప్రకాశ్ ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి రాజ్య సభ ఎంపీ గా ఉండే వారు. అయితే గత మూడు రోజుల క్రితం బండ ప్రకాశ్ రాజ్య సభ ఎంపీ కి రాజీనామా చేశారు. తన రాజీనామ పత్రాన్ని చైర్మెన్ వెంకయ్య నాయుడు కి సమర్పించారు. అందు లో భాగం గా తాజా గా వెంకయ్య నాయుడు బండ ప్రకాశ్ రాజీనామా ను ఆమోదించారు.
కాగ బండ ప్రకాశ్ ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో రాజ్య సభ ఎంపీ పదవి కి రాజీనామా చేశారు. అయితే భారత రాజ్యంగం ప్రకారం రాజకీయం గా ఒక వ్యక్తి రెండు ప్రజా ప్రతినిధులు గా ఉండరాదు. రెండిటి లో ఒక్కదా నికి రాజీనామా చేయాలి. లేదంటే ఆరు నెలల్లో ఒక దాన్ని రద్దు చేస్తారు. కాగ బండ ప్రకాశ్ 2018 లో తెలంగాణ నుంచి రాజ్యసభ కు ఎంపిక అయ్యారు. ఇంకా మూడు సంవత్సరాల పదవీ కాలం ఉండ గానే బండ ప్రకాశ్ రాజీనామా చేశారు.