కొరియన్‌ మూవీ రీమేక్ ప్లాన్ లో వెంకీ

Join Our Community
follow manalokam on social media

తెలుగులో ఎక్కువ రీమేక్స్‌ చేసిన హీరో ఎవరంటే.. టక్కున వెంకటేశ్‌ పేరు చెప్పేస్తారు. ఇదే ఆనవాయితీ కొనసాగిస్తూ.. నారప్పతోపాటు మరో రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటివరకు తమిళం.. మలయాళం సినిమాను రీమేక్ చేసిన వెంకీ ఈసారి కొరియన్‌ మూవీపై మనసు పారేసుకున్నాడట.

వెంకటేశ్‌ నటిస్తున్న నారప్ప తమిళ హిట్‌ అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ మూవీస్‌.. కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య నటించిన వెంకీమామ.. ఎఫ్‌ 2 మినహా .. గోపాల గోపాల.. గురు… దృశ్యం… ఇలా చాలావరకు పర భాషాల చిత్రాల కథలతో హిట్స్‌ కొట్టాడు వెంకీ.

కొరియాలో వచ్చిన కామెడీ అండ్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లక్కీ కీ’ని తెలుగుతోపాటు.. భారతీయ భాషలన్నింటి రీమేక్‌ రైట్స్ సొంతం చేసుకున్నామన్నారు సురేష్‌ బాబు. అయితే తెలుగులో ఏ హీరోతో తీస్తారో చెప్పలేదు. ఈ కొరియన్‌ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ నటించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఓ బేబి తర్వాత సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వస్తున్న రెండో కొరియన్‌ రీమేక్‌ మూవీ ఇది. కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా ఓ బేబి రూపొందింది. నందినిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఓ బేబి విజయం సాధించడంతో.. దగ్గుబాటి బ్రదర్స్‌ కొరియన్‌ మూవీనే నమ్ముకున్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...