మాట నిలబెట్టుకున్న కీర్తిసురేష్‌

Join Our Community
follow manalokam on social media

కీర్తి సురేష్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చేసిన తప్పు దిద్దుకుంటానని ఆమధ్య చెప్పింది. రీసెంట్‌గా సోషల్‌ మీడియాలో పెట్టిన స్టిల్స్‌ చూస్తుంటే.. ఈ అమ్మడు నిజంగానే మారిపోయిందనిపిస్తోంది. కీర్తి స్మార్ట్ లుక్ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది.


జీరో ప్యాక్‌లకు దూరంగా వుండే కీర్తి సురేష్‌ మహానటి తర్వాత మిస్‌ ఇండియా మూవీ కోసం.. వున్నట్టుండి సన్నగా ..నాజూగ్గా మారిపోయింది. సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు మిస్‌ ఇండియా.. గుడ్‌ లక్‌ సఖి విజువల్స్‌ ఫ్యాన్స్‌కే నచ్చలేదు. నేను శైలజ.. మహానటిలో చూసింది ఈ అమ్మడినేనా అన్నట్టు షాక్‌ ఇచ్చేలా సన్నబడింది కీర్తి.

జీరో ప్యాక్‌ కీర్తి సురేష్‌కు కలిసిరాలేదు. సన్నబడి నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. దీనికి తోడు ఫ్యాన్స్‌కి కూడా జీరో ప్యాక్‌ నచ్చకపోవడంతో.. మళ్లీ వెయిట్‌ గెయిట్‌ చేసింది. మిస్‌ ఇండియా మూవీ రిలీజ్‌ సందర్భంగా ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ చేసింది కీర్తి. ఈ సందర్భంగా నేను శైలజలో కీర్తిలా ఎప్పుడు మారతావని ఓ అభిమాని అడిగితే.. కమింగ్‌ సూన్‌ అంటూ సమాధానం ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే..లేటెస్ట్‌ స్టిల్స్‌ చూస్తుంటే.. నేను శైలజ కీర్తిసురేష్‌ను గుర్తుకు తెచ్చింది.

కీర్తి సురేష్‌ తెలుగులో సర్కారువారిపాటలో మహేశ్‌తో జోడీ కడుతోంది. షూటింగ్‌ ఈనెల 25నుంచి దుబాయ్‌లో మొదలవుతుంది. మహేశ్‌ ఫ్యామిలీ కలిసి ముందే.. హాలిడే ట్రిప్‌ పేరుతో అక్కడ వాలిపోయాడు. శుక్రవారం ఫైట్‌లో బిజినెస్‌ క్లాస్‌ సూట్‌లో కూర్చుని దిగిన ఫొటోలను ట్విట్టర్‌.. ఇన్‌స్టాలో షేర్‌ చేసింది కీర్తి. ముందుగా హీరోహీరోయిన్లపై సీన్స్‌.. సాంగ్స్ తీయనున్నాడు దర్శకుడు పరశురామ్‌. ఈ షెడ్యూల్‌ 20 రోజులపాటు జరుగుతుంది.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...