మంచు విష్ణు కోసం వెంకటేష్ వస్తున్నాడు..

-

వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న మంచు విష్ణు, పాన్ ఇండియా మూవీ మోసగాళ్ళు తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న విష్ణు అందుకు అనుగుణంగానే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మంచు విష్ణు చెల్లెలిగా కనిపిస్తుంది. ప్రపంచాన్నే కుదిపేసిన అతిపెద్ద ఐటీ స్కాం గురించి చూపించబోతున్న విష్ణు, ఈ సినిమాలో వెంకటేష్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నాడు.

మోసగాళ్ళు పోస్టర్ ని లాంచ్ చేసిన వెంకటేష్, ఇప్పుడు సినిమాకి వాయిస్ ఓవర్ అందిస్తాడట. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాత్రల పరిచయం దగ్గరి నుండి సినిమాలో కొన్ని ప్రధాన ఘట్టాల వరకూ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఉంటుందట. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ చేత టీజర్ ని రిలీజ్ చేయించిన విష్ణు, ఇప్పుడు వెంకటేష్ చేత వాయిస్ ఓవర్ చెప్పించడం సినిమాపై ఆయనకి ఉన్న నమ్మకాన్ని తెలియజేయడంతో పాటు జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళడంలో బాగా కృషి చేస్తున్నాడని అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news