వీడిమో వైరల్‌ : అచ్చం మనిషిలాగే.. ఏనుగు ఏం చేసిందో చూడండి !

జంతువుల్లో ఎంతో ఆకారంలో అతి పెద్ద జంతువు ఏనుగు. ఈ ఏనుగు అన్ని రకాల జంతువుల కంటే… చాలా భిన్నమైంది. చాలా జంతువులు మాంసం తింటే… ఈ జంతువు మాత్రం పూర్తి శాకహారి. అంతేకాదు… ఈ ఏనుగులు మనుషులతో కలుపుగోలుగా ఉంటాయి. అలాగే… ఎక్కువగా దేవాలయాల్లో ఉంటాయి ఈ ఏనుగులు. ఇక ఏనుగులను చాలా ఇష్టపడేవారు ఉన్నారు.

అయితే… తాజాగా ఓ ఏనుగు అచ్చం మనిషి లాగే… బోరంగ్‌ కొట్టుకుంటూ… నీళ్లు తాగింది. బాగా దాహం కావడంతో… ఎవరూ లేని సమయంలో ఓ బోరింగ్‌ దగ్గరకు వెళ్లి… తన దాహం తీర్చుకుంది. అయితే… దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అచ్చం మనిషి లాగా… నీటిని ఆదా చేసుకుంటూ… తన దాహం తీర్చుకుంటుందని ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. ఈ వీడియోను జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మనుషుల కంటే… ఆ ఏనుగే మంచినీటిని సేవ్‌ చేస్తుందని… ట్వీట్‌ చేసింది జలశక్తి మంత్రిత్వ శాఖ.