వీడియో వైరల్: తినమంటే.. నవ్వుతున్న బుడ్డోడు..!

-

చిన్నపిల్లలు ఎంతో క్యూట్ గా ఉంటారు. వాళ్ల క్యూట్ నెస్ కి అందం తోడైతే చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. చిన్నప్పటి అల్లరి చేష్టలను తల్లిదండ్రులు వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చూడండి.. ఎంత అల్లరి పిల్లాడో.. అంటూ క్యాప్షన్ కూడా పెడుతుంటారు. ఆడుకుంటున్న వీడియోలు, నిద్రపోతున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పటి వీడియోలను తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం మనం రోజూ గమినిస్తూనే ఉంటాం.

child
child

చిన్నపిల్లలు నవ్వినా.. అల్లరి చేసినా.. గారాభంగా ఏడిచినా ఎంతో ముద్దుగా ఉంటారు. అందుకే క్యూట్ క్యూట్ గా ఉండే చిన్నపిల్లల వీడియోలను చూసే నెటిజన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఓ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండ్రి ఆహారం తినిపిస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయిన ఆ బుడ్డోడిని చూసి అందరూ సంతోష పడుతున్నారు. ఎంత అందమైన నవ్వంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాంప్ మెన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘ఈ వీడియో సమయాన్ని మరిచిపోయేలా చేసింది. ఇంత కంటే అత్యుత్తమైనది ఏముంటుంది.’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. స్పూన్ తో తండ్రి ఆహారం తినిపించే ప్రతిసారి బుజ్జిపాపాయి నవ్వుతుంటే.. నిజంగా ఎవరూ నవ్వకుండా ఉండరెమో. తినమని స్పూన్ నోటి దగ్గరికి వెళ్లిన ప్రతిసారి నవ్వుతూ ఉండటం చూసి నెటిజన్లు సంతోషానికి అవధుల్లేవు. వీడియో చూస్తున్న నెటిజన్లు.. బుడ్డోడు ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు.. నా దిష్టే తగిలేలా ఉంది… తిన్నాక నవ్వు చిన్నోడా.. అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news