93వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం ఏప్రిల్ 25వ తేదీన జరగనుంది ఈ నేపథ్యంలో ఆస్కార్ బరిలోఖి వెళ్ళే సినిమాల ప్రవేశం మొదలైంది. సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డుకి ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే ప్రతీ ఫిలిమ్ మేకర్ అకాడమీ అవార్డు అందుకోవాలని కలలు కంటాడు. ఐతే తాజాగా షార్ట్ ఫిలిమ్ విభాగంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన నట్కట్ ఆస్కార్ ప్రవేశానికి ఎంపికైంది. ఇందులో విద్యాబాలన్ తో పాటు బాల నటుడు సనిక పటేల్ నటించారు.
మధ్యతరగతికి చెందిన మహిళ తన కొడుక్కి నేర్పే విలువల గురించి ఈ షార్ట్ ఫిలిమ్ లో ఉంటుంది. ఆడ మగా భేధాలు ఉండకూడని, ఆడవాళ్ళను చిన్నచూపు చూడకూడదంతూ కథల రూపంలో పిల్లాడికి నేర్పుతుంది. షాన్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోనీ స్క్రూవాలా నిర్మించాడు. మరి భారతీయ లఘుచిత్రానికి ఆస్కార్ దక్కే అదృష్టం ఉందో లేదో చూడాలి.