వియెట్‌ జెట్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌ : రూ. 9 కే ఫ్లైట్ టిక్కెట్‌

721

ఇండియాలోకి మరో కొత్త జెట్ విమానసంస్థ ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమాన‌యాన రంగం దూసుకుపోతోన్న నేప‌థ్యంలో విదేశీ విమానయాన సంస్థ‌లు కూడా స‌రికొత్త ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌దేశంలోకి విదేశీ విమాన‌యాన సంస్థ‌లు ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా వియత్నాంకు చెందిన వియెట్‌ జెట్‌ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది.

Vietjet to fly to India soon, offers flight tickets from Rs 9
Vietjet to fly to India soon, offers flight tickets from Rs 9

డిసెంబ‌ర్ నుంచి ఈ సంస్థ త‌న సేవ‌ల‌ను ప్రారంభించ‌నుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతారు. న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను న‌డ‌ప‌నున్నారు. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య స‌ర్వీసులు డిసెంబ‌ర్ 7 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

ఈ నేప‌థ్యంలోనే తొలి మూడు రోజుల‌కు ఈ సంస్థ అదిరిపోయే ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో సూపర్-సేవింగ్ టిక్కెట్లను అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌ వర్క్‌ లో ఇండియా తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా గుర్తిస్తున్న‌ట్టు ఈ సంస్థ ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు.