నయనతారను అంధురాలిగా మార్చింది ప్రియుడేనా ?

నయనతార ప్రేమిస్తే .. ప్రియుడి కోసం ఏదైనా చేయడానికి రెడీగా వుంటుంది. స్వతహాగా క్రిస్టియన్‌ అయిన నయన ప్రభుదేవా కోసం హిందూ మతం స్వీకరించింది. ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో ఐదేళ్లుగా విహరిస్తోంది నయన . ప్రియుడి కోసం అంధురాలిగా మారింది.

నయనతార గ్లామర్‌ హీరోయిన్నే కాదు మంచి పెర్ఫార్మర్‌. శ్రీరామరాజ్యంలో సీత పాత్రను మెప్పించి నంది అవార్డు కూడా అందుకుంది. ఈమధ్యకాలంలో యాక్టింగ్‌కు స్కోప్‌ వున్న రోల్సే ఎక్కువ ఎంచుకుంటోంది. ఈక్రమంలో ఆమధ్య చెవిటిదానిగా నటించిన నయన ‘నెట్రికాన్‌’లో అంధురాలిగా నటిస్తోంది. చిన్న టీజర్‌తో మరోసారి ఇంప్రెస్‌ చేసేసింది ఈ మలయాళ కుట్టి.

నయనతార అంధురాలుగా మారడానికి కారణం మాత్రం ప్రియుడు విగ్నేష్‌ శివనే. ఎందుకంటే.. నెట్రికాన్‌ మూవీకి విఘ్నేష్‌ శివనే నిర్మాత. గృహం అనే హారర్‌ థ్రిల్లర్‌తో భయపెట్టిన మిలింద్‌ రౌ దర్శకుడు కాగా.. బుధవారం నయన పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఓ సైకో కిల్లర్ కోసం వేట సాగిస్తున్నట్లు ట్రైలర్‌లో కనిపించింది నయన

నయనతారను అంధురాలిగా మార్చిన విఘ్నేష్‌ శివన్‌ ఐదేళ్ల క్రితమే.. ఈ అమ్మడికి వినిపించకుండా చేశాడు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘నానమ్‌ రౌడీధాన్‌’లో నయన చెవిటితనంతో బాధపడుతూ.. దాన్ని కవర్‌ చేసేలా ఆమె నటన ఆకట్టుకుంది. ఈ రోల్‌ నయనకు .. దర్శకుడిగా విఘ్నేష్‌కు పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ఆల్రెడీ గ్లామర్‌తో ఇంప్రెస్‌ చేసిన సీనియర్‌ స్టార్స్‌ అభినయంతో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. అనుష్క సైజ్‌ జీరోలో స్థూలకాయురాలిగా కనిపించింది. నిశ్శబ్దం మూవీలో డఫ్‌ అండ్‌ డమ్‌ రోల్‌తో ఆకట్టుకుంది.