సీఎం కేసీఆర్ మీద బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు

సీఎం ది నోరు కాదు మోరి అని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మేము 10 వేలు సరిపోవు… మీకు దుర్బుద్ధి లేక పోతే ఇంటింటికి సర్వే చేసి డబ్బులు ఇవ్వాలని ఆడిగామమని కానీ ఆయన అలా చేయలేదని అన్నారు.  చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం కి సిద్ధం కేసీఆర్ సిద్ధమేనా ? అని ప్రశ్నించిన ఆయన వరద నిధులు ఆపమన్న వాడు మూర్ఖుడు.. ఆపి నోడు ఇంకా మూర్ఖుడు అని అన్నారు. ఈ రోజు మహిళ చనిపోయింది.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని అన్నారు. కేసీఆర్ కి బీజేపీ భయం పట్టుకుందన్న ఆయన అందరూ కేసీఆర్ ని పిచ్చోడు లెక్క భావిస్తున్నారని అన్నారు.

ఇక్కడే పీకలేదు.. ఇక అక్కడ పీకుతాడా ? దేశమంతా తిరిగి డబ్బులు ఇచ్చి వచ్చాడు ..ప్రధాని అవుతానని అనుకున్నాడని అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి సంస్కారం ఉండాలన్న ఆయన టీఆర్ఎస్ కి అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. పాస్పోర్ట్ బ్రోకర్ సీఎం కి సంతకాలు ఫోర్జరీ చేయడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ పై క్రిమినల్ కేసు పెట్టాలి… లెటర్ పై విచారణ చేపట్టాలని అన్నారు. మా కార్యకర్త చిన్న కామెంట్ చేస్తే అరెస్ట్ చేశారన్న ఆయన డిజిపి ఇప్పుడు సీఎం ని అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితిలో గ్రేటర్ లో గెలవాలన్న ఆయన ప్రజల మద్దతు తమకే ఉందని అన్నారు.