ఏం కేసీఆర్… బంగారు తెలంగాణ అంటే ఇదేనా – విజయశాంతి

-

ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే..ఇదేనా బంగారు తెలంగాణ అని విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌ను డెంగీ తీవ్రంగా భయపెడుతోంది. రోజురోజుకూ కేసులు విపరితంగా పెరిగిపోతున్నయి. హైదరాబాద్‌లో జులైలో 542, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ‌వ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య 5 వేలకు పైనే ఉందన్నారు.

ఇంత జ‌రుగుతున్న కేసీఆర్ స‌ర్కార్ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రులు మాత్రం వీడియో కాన్ప‌రెన్స్ పెట్టి చేతులు దులుపుకుంటున్నరు. తాజాగా మ‌రోసారి ఇంటింటి సర్వే అంటూ కేసీఆర్ స‌ర్కార్ కొత్త నాట‌కాన్ని షూరు చేసింది. భాగ్య‌న‌గ‌రంలోనే ప‌రిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే… మారుమూల గిరిజన ఏజేన్సీ గ్రామాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉందని నిప్పులు చెరిగారు.

ఏం కేసీఆర్… బంగారు తెలంగాణ అంటే ఇదేనా..! రాష్ట్రంలో పారిశుద్ధ్య ప‌నులు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్నట్టున్నయి. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం వీటిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ త‌రఫున డిమాండ్ చేస్తున్నం. పేద‌ల జీవితాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీక‌ం త‌గిన బుద్ధి చెప్ప‌డం ఖాయం అని హెచ్చరించారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news