రేపే విజయ్ దళపతి ఫస్ట్ పార్టీ మీటింగ్!

-

తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తమిళంలోనే కాకుండా తెలుగు,హిందీ, కన్నడ, మళయాలం భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం లియో. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ పొలిటికల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కళగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు.పార్టీ ప్రకటించిన నాటి నుండి మౌనంగా ఉన్న విజయ్.. తాజాగా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. పార్టీ తొలి సమావేశాన్ని రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు. చెన్నై శివారులోని పణయూర్‌లోని పార్టీ కార్యాలయములో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు విజయ్. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటులపై కీలక చర్చ జరుగుతుంది అని సమాచారం

Read more RELATED
Recommended to you

Latest news